News March 6, 2025
హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
Similar News
News March 6, 2025
తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.
News March 6, 2025
ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.
News March 6, 2025
రాహుల్‌పై కోర్టు ఆగ్రహం.. జరిమానా ఎంతంటే?

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేరని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.