News November 1, 2024

SPF భద్రత వలయంలో సచివాలయం

image

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలను నేటి నుంచి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) చూసుకోనుంది. గతంలో TGSP బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సచివాలయ భద్రతను చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. BRS ప్రభుత్వం TGSPకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.

Similar News

News November 1, 2024

రిపబ్లికన్ల ఫారిన్ పాలసీ డిఫరెంట్

image

అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక వాతావ‌ర‌ణ మార్పుల‌ను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీక‌రించేలా కీవ్‌పై ఒత్తిడి తేవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

News November 1, 2024

విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: సీఎం రేవంత్

image

TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

News November 1, 2024

రవీంద్ర జడేజా సరికొత్త ఘనత

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు జడ్డూ 315 వికెట్లు తీశారు. ఈ క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (311) లను ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో అనిల్ కుంబ్లే (619) కొనసాగుతున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) ఉన్నారు.