News April 22, 2025
మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Similar News
News April 22, 2025
GOOD NEWS: కొత్త పెన్షన్లు ఎప్పుడంటే?

AP: కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ వారంలో సమావేశమై తుది నివేదికను సిద్ధం చేయనుంది. దాన్ని పరిశీలించిన అనంతరం జులైలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని కేటగిరీలకు కలిపి దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అలాగే దాదాపు 90వేల మందికి స్పౌజ్ పింఛన్లను జూన్ 1 నుంచి అందించనున్నట్లు సమాచారం.
News April 22, 2025
జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.
News April 22, 2025
ALERT: భక్తులకు TTD కీలక సూచన

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.