News August 11, 2024
గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా సచివాలయాలు?

AP: సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోలుగా నియమించనున్నట్లు సమాచారం. పంచాయతీ కార్యాలయం, సంక్షేమ కార్యాలయాలను విడివిడిగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. లబ్ధిదారుల గుర్తింపు, జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను వీటికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 8, 2025
రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్ను ప్రారంభించనున్నారు.
News December 8, 2025
వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.


