News July 4, 2025

వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: చంద్రబాబు

image

AP: రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను OCT 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.

Similar News

News July 4, 2025

ఈ స్కిల్స్ పెంచుకుంటే విజయం మీదే!

image

ఏ రంగంలోనైనా సక్సెస్ పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీ సొంతం అవుతుందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ తమ సంస్థాగత నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్ & ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ & నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ & క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పరిశోధన- విశ్లేషణ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, రైటింగ్స్ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని తెలిపారు.

News July 4, 2025

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

image

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్‌లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.

News July 4, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా? క్లారిటీ!

image

మొహర్రం పురస్కరించుకుని గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అయితే ఏపీలో రేపు స్కూళ్లకు రావాల్సిందేనని టీచర్లను అధికారులు ఆదేశించారు. పాఠశాలలోని 50% మంది టీచర్లు విధులకు రావాలని, పిల్లలకు యథావిధిగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. అటు తెలంగాణలో రేపు హాలిడే ఉంటుందని మెసేజులు రాలేదు. మరి మీకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.