News March 18, 2024
సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.
Similar News
News September 3, 2025
జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
News September 2, 2025
లండన్లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
News September 2, 2025
HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.


