News March 18, 2024

సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

image

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్‌కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.

Similar News

News December 3, 2025

MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

image

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

image

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్.. ప్రజాభవన్‌లో వార్ రూమ్

image

8, 9 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పనులు మరింత వేగవంతం చేసేందుకు, మీట్‌ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.