News October 14, 2024

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటే..

image

క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి, లోన్ హిస్టరీ లేని వారికి బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. నగదు పూచీకత్తుగా చెల్లించి ఈ కార్డు తీసుకోవాలి. ఉదాహరణకు కార్డు లిమిట్ రూ.50 వేలు కావాలి అనుకుంటే అంతే మొత్తం పూచీకత్తుగా చెల్లించాలి. రుణ చరిత్ర లేని వారికి దీంతో క్రెడిట్ స్కోర్ వస్తుంది. టైంకి బిల్లులు చెల్లిస్తే స్కోర్ పెరుగుతుంది. దీంతో రెగ్యులర్ అన్‌సెక్యూర్డ్ కార్డులను పొందొచ్చు.

Similar News

News November 25, 2025

రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.

News November 25, 2025

ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

image

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

News November 25, 2025

ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

image

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>