News June 2, 2024

చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

AP: మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని CBN నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

Similar News

News April 8, 2026

‘రాకా’లో హీరో, విలన్‌గా అల్లు అర్జున్?

image

అట్లీ తీస్తున్న ‘రాకా’ సినిమాలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్ విస్మయానికి గురిచేస్తోంది. మీడియా కూడా ఈ మూవీ టైటిల్‌, బన్ని పాత్రను పసిగట్టలేనంతలా మేకర్స్ గోప్యతను పాటించారు. అయితే ఈ యానిమల్ లుక్.. విలన్ పాత్రదని సినీవర్గాలు తెలిపాయి. హీరో, విలన్‌ పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో విలన్ లుక్ అదిరిపోయిందని, హీరో లుక్ కోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 8, 2026

హ్యుందాయ్ కార్లు, మహీంద్రా ట్రాక్టర్ల ధరలు పెంపు

image

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మే నుంచి అన్ని మోడల్స్ మీద 1% వరకు ధరలు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన తయారీ ఖర్చుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు మహీంద్రా గ్రూప్ సైతం తమ ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. మోడల్, ప్రాంతాన్ని బట్టి పెంపు మారుతుందని కంపెనీలు పేర్కొన్నాయి.

News April 8, 2026

రుషికొండ భవనాలు.. ఇలా ఇంకెన్నాళ్లు?

image

AP: విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలు నిరూపయోగంగా పడి ఉన్నాయి. ₹430 కోట్లతో నిర్మించిన బిల్డింగుల వినియోగంపై రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. వాటి నిర్వహణకు నెలకు ₹20 లక్షలు-25 లక్షలు అవుతున్నట్లు తెలుస్తోంది. పైగా బూజుపట్టి, పెచ్చులూడుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఆ భవనాలపై తాజ్ హోటల్ సహా పలు సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మరి అవి వినియోగంలోకి వస్తాయా?