News August 10, 2024

మిథున్‌రెడ్డికి భద్రత పెంపు

image

AP: వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భద్రత పెంచారు. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కోరడంతో కేంద్ర హోంశాఖ Y కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. 4+4 CRPF సిబ్బంది నిత్యం మిథున్‌కు భద్రతగా ఉండనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు భద్రతను తగ్గించారని పలుమార్లు ఆరోపించిన ఆయన ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 16, 2025

కోహ్లీ ట్వీట్‌పై విమర్శలు.. ఎందుకంటే?

image

ఆస్ట్రేలియాకు వెళ్లిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ‘పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన ఆటగాడు గివప్ ఇవ్వరంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది యాడ్ కోసం చేసిన ట్వీట్ అని తెలియడంతో చాలామంది అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో ఆడుకోవడం కరెక్టేనా? అని మండిపడ్డారు. ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసంటూ మరికొందరు పేర్కొన్నారు.

News October 16, 2025

అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది: మోదీ

image

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాని మోదీ కర్నూలు జీఎస్టీ సభలో అభినందించారు. ‘చంద్రబాబు చెప్పినట్లు 2047 నాటికి కచ్చితంగా మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. ఏపీలో ఎన్నో అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. సైన్స్, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఉంది’ అని పేర్కొన్నారు.

News October 16, 2025

RNSBలో ఉద్యోగాలు

image

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rnsbindia.com/