News July 15, 2024
ఆడవాళ్లకు భద్రత ఎక్కువైంది.. సింగర్ సెటైర్లు

ఆడవాళ్లపై వరుస అత్యాచారాలను సింగర్ చిన్మయి తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో ఓ 16ఏళ్ల బాలికను రేప్ చేసిన కానిస్టేబుల్ POCSO చట్టం కింద అరెస్టయిన వార్తను షేర్ చేసిన ఆమె ‘ఈ కేసులో ఏం జరుగుతుందో? బెయిల్‌పై అతడు ఎలా బయటికొస్తాడో చూడాలి’ అని ట్వీట్ చేశారు. HYDలో మహిళపై ఊబర్ డ్రైవర్ల గ్యాంగ్ రేప్, UPలో బాలిక(4)పై అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ ‘ఆడవాళ్లకు భద్రత ఎక్కువైంది’ అని ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Similar News
News January 18, 2026
నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పిస్తాం: CM

TG: నర్సింగ్ కోర్సు చేసిన వారికి జపాన్, జర్మనీలో మంచి డిమాండ్ ఉందని CM రేవంత్ అన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్సుతో పాటు జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్‌కి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. JNTU కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.
News January 18, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 18, 2026
బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.


