News July 21, 2024
పారిస్ ఒలింపిక్స్కు 40 దేశాల భద్రత.. ఇండియా కూడా!

పారిస్ ఒలింపిక్స్కు ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 45 వేల మంది సిబ్బందిని రక్షణ కోసం నియమించింది. 40 మిత్ర దేశాలకు చెందిన సుమారు 3 వేల మంది సిబ్బందిని తీసుకుంది. భారత్ నుంచి పది కే9 డాగ్స్ టీమ్స్ ఫ్రాన్స్ చేరుకున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్స్, అవాక్స్ ప్లేన్స్, డ్రోన్స్, హెలికాప్టర్లతో భద్రత పర్యవేక్షించనున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు.
Similar News
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.
News December 28, 2025
భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<


