News October 30, 2024
షర్మిలకు భద్రత పెంచాలి: ఏపీ కాంగ్రెస్

APCC చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈమేరకు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 2+2 గన్‌మెన్స్ స్థానంలో 4+4 సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచాలని కాంగ్రెస్ కోరడం గమనార్హం.
Similar News
News February 7, 2026
T20 క్రికెట్ ఇలా మొదలైంది!

కౌంటీ మ్యాచులకు ఆదరణ తగ్గుతుండటంతో కొత్త ఫార్మాట్ తీసుకురావాలని ఇంగ్లండ్ బోర్డు భావించింది. త్వరగా ముగిసేలా, స్పాన్సర్లను, కొత్త తరం అభిమానులను ఆకర్షించేలా ఉండాలని ఆలోచించింది. ఈ క్రమంలో T20లను ECB మార్కెటింగ్ మేనేజర్ రాబర్ట్సన్ ప్రతిపాదించారు. అలా 2003 జూన్ 13న ENGలో మొదటి T20 కౌంటీ మ్యాచ్ జరిగింది. 2005 Feb 17న NZ, AUS మధ్య తొలి మెన్స్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ జరిగింది.
*నేటి నుంచి T20 WC
News February 7, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,890 పెరిగి రూ.1,56,600కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,650 ఎగసి రూ.1,43,550 పలుకుతోంది.
News February 7, 2026
ఆదిత్య హృదయంలో ఏం ఉంటుంది? ఎందుకు చదవాలి?

రామాయణంలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించిన స్తోత్రం ఆదిత్య హృదయం. దీన్ని ఆదివారం నాడు చదవడం ఫలప్రదం. ఇందులో 30 శ్లోకాలుంటాయి. మొదటి 14 శ్లోకాలు సూర్యుని ప్రశస్తిని, 15-21 ప్రార్థనను, 22-27 శుభ ఫలితాలను వివరిస్తాయి. ఈ స్తోత్ర పఠనంతో శత్రువులపై విజయం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, దారిద్ర్య విముక్తి లభిస్తాయి. మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన కవచంలా ఇది భక్తులను రక్షిస్తుంది.


