News April 7, 2025
HCU నుంచి బందోబస్తు ఉపసంహరణ

TG: HCU వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. పౌర సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ విజ్ఞప్తితో క్యాంపస్ నుంచి పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. కాగా విద్యార్థులపై కేసులను వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News April 8, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74227 వద్ద, నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 22535 వద్ద ముగిశాయి. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. అటు క్రూడాయిల్ రేట్లు తగ్గడం కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News April 8, 2025
ఇల్లు కట్టుకునే వారికి బ్యాడ్ న్యూస్

ఏప్రిల్‌లో సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ తెలిపింది. ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చిన సిమెంట్ ధరలు మార్చిలో తగ్గాయి. ఈనెల సౌత్ రీజియన్‌లో బస్తాకు రూ.30 చొప్పున పెరిగే అవకాశముందని పేర్కొంది.
News April 8, 2025
టీచర్ల నియామకాల రద్దుపై రాష్ట్రపతికి రాహుల్ లేఖ

పశ్చిమ బెంగాల్‌లో 25వేల టీచర్ పోస్టుల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. న్యాయంగా ఎంపికైన అభ్యర్థులను టీచర్లుగా కొనసాగించాలని కోరారు. అనర్హులతో పాటు అర్హులు కూడా నష్టపోతున్నారని, ఈ విషయంలో కలగజేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తాను ఉన్నంత వరకు అభ్యర్థులకు అన్యాయం జరగదని బెంగాల్ CM మమత ఇప్పటికే స్పష్టం చేశారు.