News February 7, 2025
బంగ్లాదేశ్ నటిపై దేశద్రోహం కేసు

బంగ్లాలో మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై విమర్శలు చేసిన నటి మెహెర్ ఆఫ్రోజ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. జమాల్‌పూర్‌లోని ఆమె ఇంటిపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టడం గమనార్హం. బహిష్కృత నేత హసీనాకు చెందిన ఆవామీ లీగ్‌లో ఆఫ్రోజ్ తండ్రి సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి అదే పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.
Similar News
News January 18, 2026
చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ చనిపోయారు. అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ చిత్రాల్లో పరాగ్ త్యాగి నటించారు.
News January 18, 2026
టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.
News January 18, 2026
వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

* BP, డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.


