News August 8, 2024
విత్తనాల కొరత లేకుండా చూడండి: చంద్రబాబు

APలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేశారు. ‘జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి. రెండేళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెంచాలి. నిమ్మ, టమాట, మామిడి పంటల విలువ పెంచేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి’ అని CM సూచించారు.
Similar News
News November 12, 2025
క్రికెట్ న్యూస్ రౌండప్

⭒ AFG-U19 జట్టుతో జరిగే సిరీస్ కోసం భారత U-19 క్రికెట్ టీమ్కు ఎంపికైన HYD పేసర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్
⭒ రేపు రాజ్కోట్ వేదికగా మ.1.30 నుంచి IND-A, SA-A మధ్య తొలి అనధికార ODI
⭒ టెస్ట్ టీమ్ నుంచి నితీశ్ రెడ్డిని రిలీజ్ చేసిన BCCI.. SA-A వన్డే సిరీస్లో ఆడనున్న నితీశ్.. రెండో టెస్ట్ నాటికి తిరిగి జట్టులో చేరిక
⭒ INDతో టెస్ట్ సిరీసే నా కెరీర్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్: SA హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్
News November 12, 2025
ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్

AP: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత 16 నెలల్లో $120B పెట్టుబడులు వచ్చాయి. 5 ఏళ్లలో 20L ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. పెట్టుబడిదారులు APని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని CII సమ్మిట్పై నిర్వహించిన ప్రెస్మీట్లో వివరించారు.
News November 12, 2025
జమ్మూకశ్మీర్లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.


