News June 28, 2024

సీడ్ యాక్సెస్ రోడ్డు.. భూములిచ్చేందుకు రైతుల సంసిద్ధత

image

AP: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు తాడేపల్లి మండలం పెనుమాక రైతులు ముందుకొచ్చారు. మొత్తం 3.21 ఎకరాలు సేకరించాల్సి ఉంది. గతంలో భూములిచ్చిన వారికి ఎకరాకు డెవలప్‌మెంట్ ప్లాట్ల కింద 1450 గజాలు ఇచ్చారు. అయితే భూమి ధరల దృష్ట్యా 2000 నుంచి 2400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. దీనిని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు

image

TG: దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు.

News October 11, 2024

పాక్ దుస్థితి: 5 రోజులు 2 నగరాలు షట్‌డౌన్

image

OCT 14-16 మధ్య జరిగే SCO సమ్మిట్ పాకిస్థాన్ ప్రాణం మీదకొచ్చింది. పటిష్ఠ భద్రత కల్పించేందుకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను 5 రోజులు షట్‌డౌన్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, వెడ్డింగ్ హాల్స్, కేఫ్స్, స్నూకర్ క్లబ్స్, క్యాష్ అండ్ క్యారీ మార్ట్స్ సహా అన్నిటినీ మూసేస్తున్నారు. బిల్డింగులపై కమాండోలు, స్నైపర్ షూటర్లను మోహరిస్తున్నారు. దేశం దివాలా తీయడంతో తిండి దొరక్క చస్తున్న ప్రజలకు ఇది పెద్ద షాకే.

News October 11, 2024

నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు

image

AP: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామోలిన్ లీటర్ రూ.110, సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.124 చొప్పున అమ్మనున్నట్లు చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున తక్కువ ధరలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఒకే ధరకు అమ్మాలని వ్యాపారులకు సూచించారు.