News September 21, 2025
సంతానోత్పత్తిని పెంచే సీడ్ సైక్లింగ్

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.
Similar News
News September 21, 2025
మళ్లీ ‘నో హ్యాండ్‌షేక్’ అవమానం తప్పదా?

Sep14న మ్యాచ్ ముగిశాక భారత ఆటగాళ్లు తమ క్రికెటర్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడాన్ని PAK అవమానంగా భావించింది. ఆ వివాదంలోకి రిఫరీ పైక్రాఫ్ట్‌ను లాగి నిందించింది. అతడిని తొలగించకపోతే UAEతో మ్యాచ్ ఆడబోమని ఉడత బెదిరింపులకు దిగింది. ICC వినకపోవడంతో మ్యాచ్ ఆడేసింది. నేడు అతడే రిఫరీగా INDతో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ‘నో హ్యాండ్‌షేక్’ అవమానానికి అవకాశం ఉంది. PAK ఈసారి ఎవర్ని నిందిస్తుందో?
News September 21, 2025
బతుకమ్మ చీర: ఇప్పుడు ఒకటి.. సంక్రాంతికి మరొకటి!

TG: బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈ బతుకమ్మకు ఒక చీర, సంక్రాంతి లోపు మరో చీర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2-3 రోజుల్లో చీరల పంపిణీ ప్రారంభం కానుంది. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వనున్నారు. ఈ సారి ఒక్కో చీరకు ప్రభుత్వం రూ.800 చొప్పున ఖర్చు చేస్తోంది.
News September 21, 2025
మైథాలజీ క్విజ్ – 12 సమాధానాలు

1. లక్ష్మణుడి భార్యయైన ఊర్మిళ తండ్రి ‘జనక మహారాజు’. సీతమ్మవారి తండ్రి కూడా జనకుడే.
2. మహాభారతంలో సత్యవతి, శంతనుల కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు.
3. వేదాల ప్రకారం.. మొదట మరణించిన వ్యక్తి ‘యముడు’.
4. మానస సరోవరం చైనాలో ఉంది.
5. సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది.
<<-se>>#mythologyquiz<<>>