News September 24, 2024
SEEDAP ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్‌గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.
Similar News
News February 23, 2026
ఉపాధి హామీ బిల్లుల అప్లోడ్‌పై కలెక్టర్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండేచర్ బిల్లులను ప్రత్యేక దృష్టితో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు ఆదేశించారు. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.86.87 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయని, మిగిలిన రూ.44.48 కోట్ల బిల్లులను మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. ఏ బిల్లు 24 గంటలకు మించి పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు లక్ష్యాలు సాధించాలన్నారు.
News February 23, 2026
సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.


