News August 22, 2024
80 శాతం రాయితీతో విత్తనాలు

AP: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో సాధారణం(37 లక్షల ఎకరాలు) కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉలవ, పెసర, అలసందలు, జొన్న, మినుము, కొర్ర, సజ్జలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8 జిల్లాల రైతులకు 69వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనుంది.
Similar News
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్లో 18 మంది 500 వికెట్లు తీశారు.
News January 22, 2026
5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.


