News August 12, 2024
సీమ రైతుల ఆశలు ‘తుంగభద్ర గేటు’లో కొట్టుకుపోయాయ్
AP: తుంగభద్ర డ్యామ్‌లో <<13826350>>గేటు<<>> కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా అన్ని గేట్లూ ఎత్తేశారు. దీంతో మొత్తంగా 61 టీఎంసీలు వృథా కానున్నాయి. దీనివల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది. తుంగభద్రకు వచ్చే 4 నెలల్లో కనిష్ఠంగా వరద వస్తుందని, మళ్లీ డ్యామ్ నిండటం కష్టమని నిపుణులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 18, 2025
మరోసారి జత కట్టనున్న ధనుష్-వెంకీ అట్లూరి!
‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టును తమిళ నటుడు ధనుష్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండోసారి ధనుష్‌తో జత కట్టనున్నారని, దీనికి ‘హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘సార్’ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
News January 18, 2025
మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్
TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.
News January 18, 2025
సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI
సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్‌కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.