News November 9, 2024
ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం

TG: కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ తరఫున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె రెండు, మూడు రోజులు అక్కడే ఉండి ఓట్లు అభ్యర్థించనున్నారు. కాగా నిన్నటివరకు సీతక్క మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఎలా నివారించాలి?

జెమిని వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.
News November 25, 2025
మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.


