News October 11, 2025
సెహ్వాగ్ సాయం.. U19 జట్టులో పుల్వామా అమరవీరుడి కుమారుడు!

పుల్వామా దాడిలో అమరుడైన విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ హరియాణా U19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన స్కూలులో రాహుల్‌కు ఉచిత విద్య, క్రికెట్ ట్రైనింగ్ అందిస్తున్నారు. U19 టీమ్‌కు రాహుల్ ఎంపికవడం గర్వంగా ఉందని సెహ్వాగ్ తెలిపారు. రాహుల్ గతంలో హరియాణా U14, U16 జట్లకు ఆడాడు. కాగా మరో అమర జవాన్ రామ్ వకీల్ తనయుడు అర్పిత్ కూడా సెహ్వాగ్ స్కూలులోనే చదువుతున్నాడు.
Similar News
News October 11, 2025
పవన్ హాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(0CT 12)ఆఖరు తేదీ. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://www.pawanhans.co.in/
News October 11, 2025
Ceasefire: సైన్యం వెనక్కి.. ప్రజలు గాజాలోకి!

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పీస్ డీల్ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. తమ దళాలను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీంతో రెండేళ్లుగా గుడారాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కానీ గాజాలో అంతా నాశనమైందని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఆయుధాలు వదలబోమని హమాస్ నేతలు చెబుతుండటంతో యుద్ధం ముగుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News October 11, 2025
రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: హైకోర్టు

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం <<17958620>>స్టే<<>> విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.