News November 29, 2024

500 కేజీల డ్రగ్స్ పట్టివేత

image

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.

Similar News

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

image

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.

News December 6, 2025

రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

image

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News December 6, 2025

భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్‌ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.