News May 1, 2024
WCకు సెలక్ట్ అయ్యారు.. ఇప్పుడు తుస్సుమంటున్నారు

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును నిన్న బీసీసీఐ ప్రకటించింది. అందులో సెలక్ట్ అయిన ప్లేయర్లు బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతున్నారు. నిన్న రోహిత్ 4, సూర్య 10, పాండ్య 0 విఫలం కాగా, ఇవాళ దూబే 0, జడేజా 2 పరుగులకే వెనుదిరిగారు. టీ20లకు ఫామ్ చాలా అవసరమని.. ఇప్పటికైనా జోరు పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 14, 2026
పంచాయతీలకు మరో ₹640కోట్లు విడుదల

TG: గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నుంచి మరో ₹640Cr విడుదల చేసింది. వీటితో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బకాయిలు వచ్చేశాయి. యుటిలిటీ సర్టిఫికెట్లు, ఇతర రిపోర్టులను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుండటం వల్లే నిధులు త్వరగా రిలీజ్ అయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. FY 2025-26కి సంబంధించి ₹1255Cr రావాల్సి ఉందని, వాటిని కూడా త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
News March 14, 2026
6 నెలల్లో స్థానిక ఎన్నికలు: CM

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. నిన్న క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని, ఈసారీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
News March 14, 2026
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best


