News October 9, 2025
సెలక్షన్ నా చేతుల్లో ఉండదు: షమీ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు. ‘సెలక్షన్ అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ల నిర్ణయం. నేను జట్టులో ఉండాలనుకుంటే సెలక్ట్ చేస్తారు. లేదంటే లేదు. నేను ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు వేశాను’ అని చెప్పారు. కెప్టెన్సీ మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని, గిల్‌కు అనుభవం ఉందని తెలిపారు.
Similar News
News October 9, 2025
ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.
News October 9, 2025
హర్షిత్ సెలక్షన్ వెనక లాజిక్ ఏంటో: అశ్విన్

టీమ్ ఇండియాలోకి హర్షిత్ రాణాను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ స్పందించారు. ‘హర్షిత్ సెలక్షన్ వెనకున్న లాజిక్ ఏంటో తెలియదు. అతడిని ఎందుకు తీసుకున్నారో నాకూ తెలుసుకోవాలనుంది. AUSలో బ్యాటింగ్ కూడా చేయగలిగిన బౌలర్ అవసరం. హర్షిత్ బ్యాటింగ్ చేస్తాడని వాళ్లు భావించి ఉండొచ్చు. అతడు అర్హుడా అని నన్నడిగితే.. సందేహించాల్సిన విషయమే’ అని చెప్పారు.
News October 9, 2025
ప్రెగ్నెన్సీలో కాల్షియం లోపం..

ప్రెగ్నెన్సీలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. శిశువు ఎముకలు, దంతాలు అభివృద్ధి చెందడానికి కాల్షియం ఎంతో అవసరం. శిశువుకు కాల్షియం తల్లి నుంచి లభిస్తుంది. తల్లికి కాల్షియం లోపం ఉంటే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడుతుంది. శిశువు గుండె, కండరాలతో పాటు నరాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆహారంలో సోయా, చియా సీడ్స్, బీన్స్, బెండకాయలు చేర్చుకోవాలని సూచిస్తున్నారు.