News November 3, 2024

ఈనెల 5 నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి

image

TG: ఈనెల 5 నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వని, ల‌బ్ధిదారుల ఇష్టం మేర‌కు నిర్మించుకోవ‌చ్చన్నారు. క‌నీసం 400 చ‌.అడుగులకు త‌గ్గ‌కుండా ఇల్లు నిర్మించుకోవాలని, త‌ప్ప‌నిస‌రిగా కిచెన్, బాత్రూం ఉండాలని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.

News February 24, 2026

₹130 కోట్ల రివార్డున్న క్రిమినల్ హతం.. ప్రియురాలే కారణం!

image

మెక్సికోలో రూ.130 కోట్ల రివార్డు ఉన్న డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ <<19213322>>హతమవడానికి<<>> పరోక్షంగా అతని ప్రియురాలు కారణమయ్యారు. ఆమెను కొన్నిరోజులుగా ట్రాక్ చేసి అతని జాడను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘మరుసటి రోజే డ్రగ్ డాన్ స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను అడవిలోకి పారిపోయాడు. వెంటాడి అటాక్ చేయడంతో ఎల్ మెంచో, అనుచరులు గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు’ అని వెల్లడించారు.

News February 24, 2026

త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు: సుభాష్

image

AP: ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 88.16L మంది కార్మికులు నమోదయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 18.24L మంది చేరారని తెలిపారు. త్వరలో కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సాయం, మరణ, అంత్యక్రియల సమయంలో ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల కోసం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని అసెంబ్లీలో పేర్కొన్నారు.