News May 1, 2024

రేపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

image

అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ సెంట్రల్ కమిటీ రేపు ప్రకటించనుంది. రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీలో తిరిగి ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వయనాడ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకా గాంధీ సుముఖత వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News April 9, 2026

IPL: లక్నో టార్గెట్ ఎంతంటే?

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో KKR 20 ఓవర్లలో 181/4 రన్స్ చేసింది. కెప్టెన్ రహానే 41, రఘువంశీ 45, గ్రీన్ 32*, పావెల్ 39* రన్స్‌తో రాణించారు. అలెన్(9), రింకూ(4) నిరాశ పరిచారు. LSG బౌలర్లలో ప్రిన్స్, సిద్ధార్థ్, దిగ్వేశ్, ఆవేశ్ తలో వికెట్ తీశారు. LSG విజయానికి 182 రన్స్ అవసరం.

News April 9, 2026

విజయ్ ‘జననాయగన్’ మూవీ సీన్లు లీక్!

image

రిలీజ్ కోసం పోరాడుతున్న దళపతి విజయ్ ‘జననాయగన్’కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు, ఓ పాట లీక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాకు రిలీజ్ క్లియరెన్స్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది విజయ్ ఆఖరి సినిమా కావడంతో ‘జననాయగన్’కు ఇలా వరుస షాక్‌లు తగలడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు.

News April 9, 2026

PHOTOS: కొత్త లుక్‌లో పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో కనిపించారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కువగా కుర్తా, పైజామా ధరించడం చూస్తున్నాం. అయితే ఇవాళ అధికారులతో రివ్యూ మీటింగ్‌కు పవన్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్‌‌‌, బ్లాక్ కలర్ ప్యాంటుతో హాజరయ్యారు. దీంతో ఈ ఫొటోలను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. పవర్ స్టార్ లుక్‌ ఎలా ఉందో కామెంట్ చేయండి.