News October 11, 2025
ఆత్మ జ్ఞానమే అత్యున్నత ధర్మం

ధర్మశాస్త్రాల ప్రకారం.. గొప్ప వాటిని రక్షించడానికి చిన్నవాటిని త్యాగం చేయవచ్చు. ఉదాహరణకు.. దేశం కోసం గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని వదులుకోవచ్చు. అయితే వీటన్నింటికంటే అత్యంత ప్రియమైనది, శాశ్వతమైనది ఆత్మ. భార్య, సంపదలు కూడా ఆత్మ ప్రీతి కోసమే మనకు ప్రియంగా మారుతాయి. ఇక్కడ ఆత్మ అంటే ఆ పరమాత్ముడే. ఆయన మనలోనే ఉంటాడు. ఇలా.. ఆత్మ జ్ఞానాన్ని పొందడమే జీవన పరమావధి అని విదురుడు చెబుతాడు. <<-se>>#Daivam<<>>
Similar News
News October 11, 2025
మావోయిస్టుల కొత్త దళపతి దేవ్‌జీ కాదా?

మావోయిస్టుల సారథి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించాక కొత్త చీఫ్ ఎవరనే దానిపై గందరగోళం నెలకొంది. జగిత్యాల (TG) జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని నియమించారని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ దళానికి సెక్రటరీని ఇంకా నియమించలేదని, పార్టీలో విభేదాలున్నాయని లొంగిపోయిన మావోలు చెప్పడం గమనార్హం. కీలక నేతల లొంగుబాటు, మల్లోజుల లేఖల నేపథ్యంలో పార్టీ దళపతిగా ఎవరొస్తారనేది కీలకంగా మారింది.
News October 11, 2025
సహజ కాన్పుతో సమస్యలు వస్తాయా?

సిజేరియన్‌తో పోలిస్తే సహజ కాన్పు అయితే ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. నార్మల్ డెలివరీ తర్వాత చాలామంది మహిళలకు యోని పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం, గర్భాశయ వ్యాధి, మూత్ర విసర్జన సమస్యలు, మూత్రం ఆపుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎలాంటి కాన్పు జరిగినా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 11, 2025
1289 పోస్టులు.. అప్లైకి ఇంకా నాలుగు రోజులే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1,289 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా నాలుగు రోజులే సమయం( OCT15) ఉంది. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, PE, MT/ట్రేడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.