News April 16, 2024
RCBని అమ్మిపారేయండి: టెన్నిస్ స్టార్

RCBని కొత్త ఫ్రాంచైజీకి విక్రయించాలని టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అన్నారు. ఫ్రాంచైజీపై శ్రద్ధ వహించే యజమానికే అమ్మేయాలని సూచించారు. ఫ్యాన్స్ కోసమైనా ఆ పని చేయాలని కోరారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో ‘రూ.47 కోట్లు బెంచ్‌కే పరిమితం చేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రీన్ (రూ.17.5 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ.11.5 కోట్లు), జోసెఫ్ (రూ.11 కోట్లు), సిరాజ్ (రూ.7 కోట్లు) బెంచ్‌కే పరిమితమయ్యారు.
Similar News
News April 4, 2026
ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

అమెరికా రీసెంట్‌గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్‌పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
News April 4, 2026
ఇవాళ, రేపు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.
News April 4, 2026
ALERT: ఇవాళ వర్షాలు

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.


