News December 20, 2024
23న విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు

AP: విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల క్రైస్తవ మతపెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అటు క్రిస్మస్ సందర్భంగా హై టీ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున కేటాయించింది.
Similar News
News November 11, 2025
బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి.
News November 11, 2025
బిహార్లో NDA జయకేతనం: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

బిహార్లో BJP, JDU నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, NDAకి 133-159, మహాఘట్ బంధన్కు 75-101, ఇతరులకు 2-8 స్థానాలు, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వివరించింది. దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమిపై NDA పైచేయి సాధించనున్నట్లు తెలిపింది.


