News June 27, 2024

SEMI FINAL: వారిని త్వరగా ఔట్ చేస్తేనే..

image

T20WC రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఆ జట్టు బౌలింగ్‌ కంటే బ్యాటింగ్‌ పరంగానే బలంగా ఉంది. ఓపెనర్లు బట్లర్(191 రన్స్), ఫిల్ సాల్ట్(183రన్స్)ను ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు అంత విజయావకాశాలుంటాయి. వీరితో పాటు మిడిలార్డర్‌లో భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే హ్యారీ బ్రూక్(120రన్స్) కూడా ప్రమాదకరమే. వీళ్లను అడ్డుకోవడంపై భారత బౌలర్లు దృష్టి పెట్టాల్సి ఉంది.

Similar News

News September 20, 2024

స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన.. రూ.25 వేల ఫైన్

image

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎదుటే మలవిసర్జన చేశాడు. దీంతో కోర్టు అతడికి రూ.25 వేల ఫైన్ విధించింది. గతేడాది భారత్‌కు చెందిన రాము చిన్నరాసా అనే కార్మికుడు మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు. తర్వాత మద్యం మత్తులో బాత్‌రూమ్‌కు వెళ్లే దారి తెలియక హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News September 20, 2024

దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే

image

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్‌ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్‌తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.

News September 20, 2024

సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1949: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం