News December 10, 2024
షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపండి: పాక్ మాజీ క్రికెటర్

భారత జట్టుకు మహ్మద్ షమీ సేవలు ఎంతో అవసరమని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు. వెంటనే ఆయనను ఆస్ట్రేలియా పంపాలని సూచించారు. ‘షమీని ఆడించాలనుకుంటే దయచేసి ఇప్పుడే పంపండి. మూడో టెస్టులోనే ఆయనను ఆడించండి. నాలుగో టెస్టుకు ఆడిస్తే లాభం ఉండదు. భారత పేసర్ల బృందాన్ని ముందుండి నడిపిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా BGTలో చివరి రెండు టెస్టులకు షమీ ఎంపికవుతారని టాక్.
Similar News
News November 2, 2025
పసుపుతో అందమైన పెదాలు

ముఖ సౌందర్యంలో పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేచురల్‌గా అందంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించండి. * పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. * చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి.
News November 2, 2025
విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్‌తో పోలిస్తే 8.77శాతం వృద్ధి


