News August 17, 2025

సీనియర్ నటి కన్నుమూత

image

ప్రముఖ మరాఠీ నటి జ్యోతీ చందేకర్(69) అనారోగ్యంతో కన్నుమూశారు. 12ఏళ్ల వయసులోనే యాక్టింగ్ ప్రారంభించిన ఆమె సీరియళ్లు, చిత్రాల్లో నటించారు. ‘థోల్కీ’, ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. చందేకర్ కూతురు తేజస్వినీ పండిట్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘తిచా ఉంబర్తా’లో నటించడం విశేషం. జ్యోతి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Similar News

News August 17, 2025

‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

image

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.

News August 17, 2025

నేను రాజకీయాల్లోకి రాను: పాక్ ఆర్మీ చీఫ్

image

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నన్ను దేవుడు పాక్ రక్షకుడిగా పంపాడు. నేను సైనికుడిని. ఇలాగే ఉంటా. దేశం కోసం ఆత్మబలిదానానికైనా సిద్ధం. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం లేదు’ అని చెప్పారు. అమెరికా, చైనా రెండూ తమ మిత్ర దేశాలేనని.. ఒక ఫ్రెండ్ కోసం మరొకరిని వదులుకోలేమని తేల్చి చెప్పారు.

News August 17, 2025

56 రోజుల్లో 261 మంది మృతి

image

హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి నిన్నటి వరకు పలు ఘటనల్లో 261 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదలు, కొండచరియలు విరిగి పడటం, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో 136 మంది మరణించగా, 125 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని పేర్కొంది. సుమారుగా రూ.2 లక్షల కోట్లకు పైగా ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.