News March 17, 2025

అనారోగ్యంతో సీనియర్ నటి కన్నుమూత

image

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూశారు. చెన్నైలో నిన్న తుదిశ్వాస విడువగా ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. 1982లో తమిళ సినిమా ‘కోళీ కూవుతు’తో కెరీర్ మొదలెట్టి తెలుగులో ‘దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, ప్రాణానికి ప్రాణం’ తదితర సినిమాల్లో నటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన ఆమె అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూవచ్చారు. <<15773373>>ఆమె<<>> భారీగా బరువు తగ్గడంపైనా గతవారం కథనాలు వచ్చాయి.

Similar News

News January 7, 2026

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.

News January 7, 2026

‘జన నాయగన్’ వాయిదా.. రాజాసాబ్‌కు జాక్‌పాట్

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ‘రాజాసాబ్’ జాక్‌పాట్ కొట్టింది. తమిళనాడులోని దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో జన నాయగన్ స్థానంలో రాజాసాబ్‌కు షోలు కేటాయిస్తున్నారు. దీంతో పండుగ వేళ తెలుగుతో పాటు తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ రెండు సినిమాలు జనవరి 9కి రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో విజయ్ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

News January 7, 2026

ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలపై SEC, HCకి ఫిర్యాదు: జగన్

image

AP: MPP ఉప ఎన్నికల్లో కూటమినేతలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని YCP చీఫ్ జగన్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాల్సిన ఎన్నికను దౌర్జన్యంతో గెలుపొందడం దారుణమని మండిపడ్డారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ MPTC సభ్యులు జగన్‌ను కలిసి ఎన్నికలో ప్రభుత్వ తీరును వివరించారు. కాగా రేపు 11amకి జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.