News May 12, 2024
సీనియర్ నటి పవిత్ర కన్నుమూత

తెలుగులో ‘త్రినయని’ సీరియల్‌తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్ మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కన్నడలో ‘రోబో ఫ్యామిలీ’ అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో మొదటగా ‘నిన్నేపెళ్లాడతా’ అనే సీరియల్‌లో నటించారు.
Similar News
News February 4, 2026
మున్సి‘పోల్స్’: ఆసక్తికరంగా ఆ 4 స్థానాల్లో పోరు

TG: CM రేవంత్, BRS చీఫ్ KCR సహా KTR, హరీశ్ రావుల నియోజకవర్గ కేంద్రాలైన కొడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాల్టీల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడి పరిణామాలపై అధికారపార్టీ దృష్టి పెట్టింది. BRS నేతల మున్సిపాల్టీల బాధ్యతను మంత్రులు తుమ్మల, వివేక్‌కు అప్పగించింది. మరోపక్క కొడంగల్‌లో BRSను గెలిపించడం ద్వారా రేవంత్‌కు చెక్ పెట్టాలని KTR, హరీశ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.
News February 4, 2026
హెయిర్ డై చేస్తున్నారా?

మొదటిసారి హెయిర్ డై వాడేవారు ముందుగా టెస్ట్ చేసుకోవాలి. చెవి వెనుక భాగంలో కాస్త డై రాసుకొని ఎలాంటి రియాక్షన్ లేకపోతే దాన్ని వాడొచ్చు. ఇంట్లోనే డై చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక రెండుసార్లు పార్లర్‌లో ప్రొఫెషనల్స్‌తో వేయించుకోవాలి. వారు ఎలా వేస్తున్నారో గమనించి తర్వాత ఆ టెక్నిక్స్‌ను ఇంటి దగ్గర వాడటం మంచిది. వీలైనంత వరకు నాణ్యంగా ఉన్న డైలనే వాడాలి. లేదంటే కళ్లు, పెదాలు వాపు, దురద వంటివి వస్తాయి.
News February 4, 2026
‘కొరియానే మా లోకం’.. మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు!

ఘజియాబాద్(UP) సిస్టర్స్ <<19045678>>ఆత్మహత్య<<>> కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ముగ్గురూ కొరియన్ కల్చర్‌కు అడిక్ట్ అయ్యి పేర్లనూ మార్చుకున్నారని తండ్రి చేతన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని తరచూ అనేవారట. సూసైడ్ లెటర్‌లో ‘అమ్మానాన్న సారీ’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకినట్లు తేలింది.


