News October 29, 2024
టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబూమోహన్

TG: సీనియర్ నటుడు బాబూమోహన్ TDP సభ్యత్వం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మెంబర్షిప్ తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులో బాబూమోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురయ్యారు. బాబూమోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1999లోనూ విజయం సాధించి, మంత్రి అయ్యారు. అనంతరం TRSలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News November 1, 2025
అయ్యప్ప దీక్ష: స్వామి అనే ఎందుకు పిలుస్తారు?

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.
News November 1, 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

రాజస్థాన్ పిలానీలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News November 1, 2025
NO SHAVE NOVEMBER

నవంబర్ వచ్చిందంటే చాలు.. పలువురు యువకులు గడ్డం తీసేయడానికి ఒప్పుకోరు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నావ్ అని అడిగితే.. ‘నో షేవ్ నవంబర్’ అనేస్తారు. ఈ నెలలో షేవింగ్ చేయకుండా గడ్డం పెంచి, దానికయ్యే ఖర్చును క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇస్తారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, బాధితుల కోసం నిధులు సేకరించడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. 2009 నుంచి ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.


