News April 6, 2025
సినిమాల్లోకి సీనియర్ హీరోయిన్ కూతురు?

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ కుష్బూ, దర్శకుడు సుందర్‌ల కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త హీరోయిన్ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటించాలని తన మనసులో ఉందని, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని గతంలో అవంతిక చెప్పారు.
Similar News
News April 7, 2025
‘అమరావతి’కి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

AP: రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News April 7, 2025
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
News April 7, 2025
ప్రముఖ టీవీ నటుడు మృతి

అమెరికన్ టీవీ నటుడు జే నార్త్(73) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ‘డెన్నిస్ ది మెనస్’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. వాంటెడ్, 77 సన్‌సెట్ స్ట్రిప్, షుగర్ఫుట్ వంటి షోల్లో గెస్ట్ పాత్రల్లో మెరిశారు. ది టీచర్, మాయ వంటి చిత్రాల్లోనూ నటించారు.