News September 5, 2024
సంచలనం: 10 ఓవర్లు, 10 రన్స్, 10 వికెట్లు

టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్-ఏలో సంచలనం నమోదైంది. సింగపూర్తో మ్యాచ్లో మంగోలియా జట్టు 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, మరో నలుగురు ఒక పరుగుకే వెనుదిరిగారు. షురెంట్సెట్, గన్బోల్డ్ చెరో 2 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సింగపూర్ జట్టులో హర్ష భరద్వాజ్ 6 వికెట్లతో చెలరేగారు. టార్గెట్ను సింగపూర్ 5 బంతుల్లో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
Similar News
News December 2, 2025
కొత్తగూడెం సీఎం సభలో చిన్నారి వినూత్న ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి సభలో కొత్తగూడెం టౌన్ రామవరంకు చెందిన నైనిక రజ్వ వినుత్న ప్రచారం చేపట్టారు. మానవులకు ఆక్సిజన్ ప్రాణ వాయువు అని, చెట్లు ఆహారాన్ని నీడను ఔషధాలను ఇస్తాయని ప్లకార్డు ప్రదర్శించారు. వర్షాలకు, ప్రాణవాయువుకు కారణమైన చెట్లను పెంచకపోతే భవిష్యత్తులో వీపున ఆక్సిజన్ సిలిండర్ మోయాల్సి వస్తుందని పిలుపునిచ్చారు. వీపున సిలిండర్ ధరించి ప్రచారం చేపట్టారు. చిన్నారి ప్రచారాన్ని పలువురు అభినందించారు.
News December 2, 2025
పగిలిపోయిన దేవతా విగ్రహాలను పూజించవచ్చా?

పగిలిన దేవతా మూర్తుల విగ్రహాలు, చిరిగిన పటాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల భక్తి భావన తగ్గే అవకాశాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘అలాంటి విగ్రహాలు, చిత్రపటాలను పారే నీటిలో నిమజ్జనం చేయాలి. లేకపోతే ఏదైనా దేవాలయం చెట్టు మొదలులో ఉంచాలి. కాగితపు పటాలు అయితే, వాటిని అగ్నికి ఆహుతి చేసి, ఆ బూడిదను నీటిలో కలిపి చెట్ల మొదట్లో పోయడం ఉత్తమ మార్గం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


