News December 17, 2024
సంచలనం: వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు

అర్జెంటీనా బౌలర్ హెర్నాన్ ఫెన్నెల్ పురుషుల టీ20లో అరుదైన రికార్డు నెలకొల్పారు. టీ20 WC సబ్ రీజనల్ అమెరికా క్వాలిఫయర్స్లో కేమన్ ఐలాండ్స్తో జరిగిన మ్యాచులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీశారు. మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్గా నిలిచారు.
* క్రికెట్లో వరుస బంతుల్లో 4 వికెట్లు తీస్తే డబుల్ హ్యాట్రిక్గా పరిగణిస్తారు.
Similar News
News November 23, 2025
సూర్యాపేట: గుడిపాటి నరసయ్య రాజకీయ నేపథ్యం

సూర్యాపేట DCC అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్య నియమితులయ్యారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లికి చెందిన ఈయన 1990-95 వరకు PPIML చండ్ర పుల్లా రెడ్డి నక్సల్ గ్రూప్లో పనిచేశారు. 2001-6 వరకు ZPTCగా, 2006-08 వరకు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో MLAగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టికెట్ ఆశించినా దక్కలేదు.
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.
News November 23, 2025
కేజీ రూపాయి.. డజను రూ.60!

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.


