News November 25, 2024
సంచలనం.. T20Iలో ఏడు పరుగులకు ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. T20Iలలో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 స్కోర్ చేయగా, ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు డకౌట్లు కాగా, ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 రన్స్ చేశారు. గతంలో మంగోలియా 10రన్స్కే(vsసింగపూర్) ఆలౌటైంది.
Similar News
News November 25, 2024
సీజ్ఫైర్కు అంగీకరించిన ఇజ్రాయెల్!
లెబనాన్లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడనుంది. ఈ ఒప్పందం మేరకు హెజ్బొల్లా తన బలగాలను లిటాని నదికి ఉత్తరంగా తరలించాలి. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ ఒప్పందం అమలును అమెరికా పర్యవేక్షిస్తుంది.
News November 25, 2024
ఢిల్లీకి ‘మహా’ రాజకీయం
మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఈ రాత్రికి క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ కూడా వెళ్లనున్నారు. వీరు ముగ్గురు బీజేపీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అందులో సీఎం క్యాండిడేట్ను నిర్ణయించనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
News November 25, 2024
CM చంద్రబాబుకు షర్మిల లేఖ
AP: CM చంద్రబాబుకు PCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం APకి పెనుభారమని లేఖలో ఆమె పేర్కొన్నారు. అక్రమ డీల్ వల్ల పాతికేళ్ల పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి అనుమతులు ఎందుకు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరగాలని, ఈ ఒప్పందాలపై CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.