News June 4, 2024
సంచలనం.. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఓటమి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా ఓటమిపాలయ్యారు. ధర్మాన, సీదిరి, బొత్స, రాజన్నదొర, అమర్నాథ్, బూడి, విశ్వరూప్, వేణు, దాడిశెట్టి, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, రజనీ, అంబటి, ఆదిమూలపు, కాకాణి, బుగ్గన, నారాయణస్వామి, ఉషశ్రీ, రోజా, అంజాద్ బాషా ఓడిపోయారు. గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి గెలిచారు.
Similar News
News December 29, 2025
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.
News December 29, 2025
మహిళలు పుట్టుకతోనే నాయకులు: ఈషా అంబానీ

నాయకత్వ స్థానాలకు పురుషులతో పాటూ స్త్రీలూ సమానంగా న్యాయం చేయగలరంటున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ. “అయితే కెరీర్లో పురుషుల ఎదుగుదలతో పోలిస్తే మహిళల ఎదుగుదల చాలా కష్టం. మగవాళ్ల కంటే మహిళలు నాయకత్వంలో ముందుంటారని నేను వ్యక్తిగతంగా నమ్ముతా. మహిళలు పుట్టుకతోనే నాయకులు. మహిళల్లో ఉండే నిస్వార్థమైన మనసు వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతుంది” అని ఈషా తెలిపారు.
News December 29, 2025
శివాలయానికి వెళ్తున్నారా?

శివాలయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘ప్రదోష కాల దర్శనం గ్రహ దోష నివారణకు శ్రేష్ఠం. గణపతి దర్శనానంతరం లింగాన్ని దర్శించాలి. నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూడటం మర్వకూడదు. శివునికి అర్చించిన ప్రసాదం, విభూతి, పూలను నందిపై ఉంచరాదు. సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణలు చేయాలి’ అంటున్నారు. శివాలయంలో ‘చండీ ప్రదక్షిణ’ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


