News May 24, 2024

సంచలనం: బంగ్లా చిత్తు.. సిరీస్ అమెరికాదే

image

పొట్టి ఫార్మాట్‌లో యూఎస్ఏ మరోసారి సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై రెండో టీ20లోనూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ బంగ్లా 138 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో అమెరికా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ముంగిట ఈ విజయాలు యూఎస్‌ఏ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి.

Similar News

News December 27, 2024

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News December 27, 2024

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

image

మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.

News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.