News October 18, 2024

సంచలనం.. ఇద్దరే 20 వికెట్లు కూల్చేశారు

image

రెండో టెస్టులో ENGపై పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సులూ కలిపి వీరిద్దరే 20 వికెట్లు కూల్చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘనత సాధించిన ఏడో ద్వయంగా వీరు నిలిచారు. 52 ఏళ్లలో ఇదే తొలిసారి. నోమన్ 11(3+8), సాజిద్ 9(7+2) వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరే బౌలింగ్ చేయడం మరో విశేషం.

Similar News

News October 18, 2024

హిందీ మాసోత్సవాలొద్దు: PMకి స్టాలిన్ లేఖ

image

హిందీ భాషకు మాసోత్సవాలు జరపడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొంటూ PM మోదీకి లేఖ రాశారు. ‘రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా ఇవ్వలేదు. హిందీ భాషేతర రాష్ట్రాల్లో హిందీ మాసోత్సవాల నిర్వహణ సరికాదు. ఒకవేళ అలా నిర్వహించాలంటే ఆయా రాష్ట్రాల భాషలకూ ఉత్సవాలు చేయాలనేది నా సూచన’ అని పేర్కొన్నారు.

News October 18, 2024

INDvsNZ: రచిన్ రవీంద్ర రికార్డ్

image

ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగారు. ఆయన 13 ఫోర్లు, 4 సిక్సులతో 134 పరుగులు చేశారు. దీంతో 2012 తర్వాత భారత గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా రచిన్ చరిత్ర సృష్టించారు. ఇన్నింగ్స్ పూర్తయ్యాక రచిన్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు. 2012లో ఇదే స్టేడియంలో రాస్ టేలర్(113) సెంచరీ చేశారు.

News October 18, 2024

ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. నిన్నటి సమావేశంలో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.