News August 22, 2025

సంచలనం.. చరిత్ర సృష్టించిన క్రికెటర్

image

వన్డేల్లో ఆడిన తొలి 4 మ్యాచ్‌ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. AUSతో జరుగుతున్న 2వ వన్డేలో 78 బంతుల్లో 88 రన్స్ చేసి ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 రన్స్‌తో రికార్డులకెక్కారు.

Similar News

News April 3, 2026

వర్సిటీలో ద్రాక్ష సాగుపై విస్తృత పరిశోధనలు

image

రాజేంద్రనగర్‌ కొండా లక్ష్మణ్ బాపూజీ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అధిక దిగుబడి, నాణ్యమైన రకాలు, వ్యాధి నిరోధక పద్ధతులపై శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. రైతులకు ఆధునిక సాగు విధానాలు అందించడంలో ఈ కేంద్రం కీలకంగా ఉన్నట్టుగా శాస్రవేత్తలు చెబుతున్నారు. కోకో, మైలానా వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి.

News April 3, 2026

YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.

News April 3, 2026

అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>