News October 24, 2024
సంచలనం.. 256 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేధించారు
మహారాష్ట్ర ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. పీబీజీతో జరిగిన మ్యాచులో జెట్ జట్టు భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBG 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ఛేదనలో జెట్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. జెట్ బ్యాటర్లలో దివ్యాంగ్(49 బంతుల్లో 93*), రోహిత్ పాటిల్(30 బంతుల్లో 80) పరుగులు చేశారు.
Similar News
News January 3, 2025
నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?
చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్ను మరో రూమ్లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.
News January 3, 2025
ప్రేమ కోసం పాక్కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!
ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్కు చెందిన సనా రాణి(21)తో ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
News January 2, 2025
మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.