News July 13, 2024
సంచలనం.. వారి నుంచి ఆసరా పెన్షన్లు వెనక్కి!

TG: రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలి(<<13620026>>ఖమ్మం<<>>)కి రూ.1.70 లక్షలు తిరిగివ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.
Similar News
News March 26, 2026
నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.
News March 26, 2026
ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.
News March 26, 2026
నేటి నుంచి భానుడి భగభగలు

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.


