News September 21, 2024

సంచలనం.. SAపై అఫ్గాన్ భారీ విజయం

image

సౌతాఫ్రికాపై రెండో ODIలో అఫ్గాన్ 177 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గాన్ 311/4 స్కోర్ చేయగా, SA 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. రషీద్ 5, ఖరోటే 4 వికెట్లు తీశారు. బవుమా 38, జోర్జి 31, మార్‌క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 105, అజ్మతుల్లా 86, రహ్మత్ 50 అదరగొట్టారు.

Similar News

News January 15, 2026

MSVPG: 3 రోజుల్లో రూ.152+కోట్ల కలెక్షన్స్

image

సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో 152+కోట్ల గ్రాస్ సాధించినట్లు మెగా బ్లాక్ బస్టర్ పేరుతో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో వెంకటేశ్ క్యామియో, ఫ్యామిలీ టచ్ ఉండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న సండే వరకు ఇదే రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

News January 15, 2026

ఎగుమతుల్లో వృద్ధి.. అమెరికాకు అధికం!

image

TG: ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 2023లో రూ.95వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2024-2025 నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరాయి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తయారీ రంగంలో ఎగుమతుల్లో 35.2% కేవలం ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతులు USకు(28.17 శాతం) జరుగుతున్నాయి. అటు ఈ అంశంలో దేశంలోనే గుజరాత్ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

News January 15, 2026

‘జైలర్-2’లో విజయ్ సేతుపతి

image

రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల హింట్ ఇచ్చారు.