News November 17, 2024

షమీపై సంచలన ఆరోపణలు!

image

భారత బౌలర్ మహ్మద్ షమీ వయసుపై మోహన్ కృష్ణ అనే నెటిజన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడి వయసు ప్రస్తుతం 42 ఏళ్లు కాగా, 34 ఏళ్లంటూ బోర్డును మోసగిస్తున్నారని ఆరోపించారు. షమీకి చెందినదిగా చెబుతున్న ఓ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. బీసీసీఐ దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ బోర్డును ట్యాగ్ చేశారు. అయితే అది ఫేక్ కావొచ్చంటూ షమీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తుండటం గమనార్హం.

Similar News

News November 18, 2024

TODAY HEAD LINES

image

* ముగిసిన రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు
* ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష
* కిషన్ రెడ్డి గుజరాత్ గులాం: సీఎం రేవంత్
* లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్
* ఈవీలు కొన్నవారికి ట్యాక్స్ ఫ్రీ: మంత్రి పొన్నం
* ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
* సెంట్రల్ జైలుకు నటి కస్తూరి
* పుష్ప 2 ట్రైలర్ విడుదల
* BGT తొలి టెస్టుకు భారత కెప్టెన్‌గా బుమ్రా!

News November 18, 2024

ధోనీ కెప్టెన్సీలో ఆడారు.. మెంటార్లు అయ్యారు..!

image

భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ IPL 18వ సీజన్‌లో ఆడబోతున్నారు. కాగా కొందరు ధోనీ కెప్టెన్సీలో ఆడి రిటైర్మెంట్ పలికి తిరిగి మెంటార్లుగా IPLలో అడుగుపెడుతున్నారు. ఈ లిస్టులో ద్రవిడ్, పార్థివ్ పటేల్, జహీర్ ఖాన్, దినేశ్ కార్తీక్, బ్రావో ఉన్నారు. వీరంతా వివిధ జట్లకు కోచ్, మెంటార్లుగా నియమితులయ్యారు. ధోనీ మాత్రం ఇంకా IPLలో ఆటగాడిగా కొనసాగుతున్నారు. దీంతో అభిమానులు దటీజ్ తల అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

News November 18, 2024

ఇవి తింటే ఇప్పుడే ముసలితనం

image

కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా, బర్గర్, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరి చేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ తిన్నా చర్మంపై ముడతలు వచ్చి ముసలితనం కనిపిస్తుంది. టీ, కాఫీ, మద్యపానం ఎక్కువగా చేసినా త్వరగా ముసలివారు అయిపోతారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.