News February 3, 2025
మత మార్పిడులపై సంచలన బిల్లు

మతమార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా ఉంటుంది.
Similar News
News April 2, 2026
HYD: ‘నో సిగ్నల్ జోన్స్’కోసం వెతుకులాట!

గచ్చిబౌలి గ్లాస్ బిల్డింగ్‌ల మధ్య కాదు.. ఇప్పుడు సిటీ శివార్లలో మన జెన్-జీ వెతుకుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలకు కాదు.. ‘ప్రైవసీ’ కోసం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ‘డంప్ యార్డ్’ స్టైల్ పార్టీలు చేసుకుంటున్నారు. పబ్లిసిటీ లేని పక్కా లోకల్ కిక్కు! ‘సైలెంట్ వాక్స్’ గ్రూపులు కడుతున్నారు. ఎవరికీ చిక్కని, దొరకని ఈ ‘అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్’ ఇప్పుడు HYDలో సెన్సేషన్. యువతలో వస్తున్న ఈ మార్పు మైండ్ బ్లోయింగ్!
News April 2, 2026
ఢిల్లీ సూపర్ విక్టరీ

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.
News April 2, 2026
VDK ‘రణబాలి’ షూటింగ్ సీన్ లీక్

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ఓ సీన్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో గుర్రంపై వచ్చిన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌లో మాస్ డైలాగులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.


